వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబం వద్ద రూ. లక్ష కోట్లు ఉన్నాయని ఆరోపించి, వరద సహాయ నిధిగా రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శ

‘పదేళ్ల పాలనలో రూ.లక్ష కోట్లు వెనకేశారు.. రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలం అవుతున్న ఈ పరిస్థితిలో కనీసం రూ.2 వేల కోట్లన్నా సీఎం సహాయ నిధికి ఇవ్వొచ్చు కదా’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. మంగళవారం ఉదయం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పర్యటించి వరద…

Read More
సీఎం రేవంత్ రెడ్డి, హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల పరిరక్షణ కోసం ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం.

రంగనాథ్‌కు మ‌రో కీల‌క బాధ్య‌త

ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ)ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంస్థ‌కు క‌మిష‌న‌ర్‌గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌ను అప్ప‌గించే యోచ‌న‌లో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.   హెచ్ఎండీఏ ప‌రిధిలోని చెరువుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా రంగ‌నాథ్‌ను నియ‌మిస్తార‌ని స‌మాచారం….

Read More
ఫ్రాన్స్‌లో దారుణం: 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు Description: ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి 10 ఏళ్లపాటు తన భార్యపై 92 సార్లు అత్యాచారాలు చేశాడు. అత్యాచారాలకు 72 మంది వ్యక్తులు సంబంధం ఉన్నారు.

ఫ్రాన్స్‌లో దారుణం…. 10 ఏళ్ల పాటు భార్యపై 92 అత్యాచారాలు

యావత్ ఫ్రాన్స్ దేశాన్ని నిర్ఘాంతపరిచే ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన భార్యపై 10 ఏళ్లపాటు ఏకంగా 92 అత్యాచారాలు చేపించాడు. భార్యకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి.. ఆమె మత్తులో ఉన్న సమయంలో ప్రైవేటు అపరిచిత వ్యక్తులతో ఈ దురాగతాలు చేయించాడు. ఆన్‌లైన్‌లో రిక్రూట్‌ చేసుకున్న వ్యక్తులతో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు నమోదైన ఆరోపణలపై నిందితుడు డొమినిక్ సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యాడు. కాగా బాధితురాలిపై మొత్తం 72 మంది వ్యక్తులు…

Read More

హర్యానాలో దారుణం: 12వ తరగతి విద్యార్థిని కాల్చి హత్య

హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణం జరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి 12వ తరగతి విద్యార్థిని 30 కిలోమీటర్లు వెంటాడి కాల్చి చంపారు. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గో సంరక్షణ గ్రూపులోని ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణా, ఆదేశ్, సౌరభ్‌గా గుర్తించారు. బాధితుడు ఆర్యన్ మిశ్రా, ఆయన స్నేహితులు షాంకీ, హర్షిత్‌లను నిందితులు పశువుల స్మగ్లర్లుగా పొరబడి ఈ దారుణానికి తెగబడ్డారు. ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై కారులో…

Read More
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడంలేదు. కుండపోత వర్షాలకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో చాలామంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు మరో హెచ్చరిక చేశారు. ఈ నెల 5న (గురువారం) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఉంటుందని, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. తెలంగాణలోని ఎనిమిది రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం…

Read More
చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలు సమీక్షించారు. భూమికలో ఆహారం అందించలేకపోవడం మరియు బాధితుల కష్టాలను చెబుతూ, అధికారులను హెచ్చరించారు.

చంద్రబాబుకు వరద బాధితుల పట్ల సానుభూతి

విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరద సహాయక చర్యలపై నిన్న అర్ధరాత్రి  11.30 గంటలకు ఆయన ఉన్నతాధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ ముంపు ప్రాంతాల చివర ఉన్నవారికి ఆహార పొట్లాలను అందించలేకపోవడం బాధాకరంగా ఉందని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రారంభంలోనే ఆహార పొట్లాలను బాధితులు తీసుకుంటుండటంతో… అవి చివరి వరకు చేరలేకపోతున్నాయని తెలిపారు.  తాను వరద…

Read More
అశ్విన్ జడేజా ప్రతిభను మెచ్చుకుంటూ, జట్టులో స్థానం కోల్పోవడంపై అసూయ లేనని స్పష్టం చేశాడు. స్నేహపూర్వక సంబంధం ఉందని పేర్కొన్నాడు.

అశ్విన్ జడేజాపై ప్రశంసలు, అసూయను నిస్సందేహంగా ఖండించారు

టీమిండియా దిగ్గజ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దాదాపు రెండు దశాబ్దాలుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జట్టుకు కీలకమైన స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్ల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. స్వదేశీ పరిస్థితులలో ఇద్దరికీ సమష్టిగా బౌలింగ్ అవకాశాలు లభిస్తుండగా.. విదేశాల్లో ఆడే టెస్టులకు మాత్రం జడేజా కంటే అశ్విన్‌కే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంటుంది. కాగా తోటి స్పిన్నర్ జడేజాపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన…

Read More