
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వరద నష్టం
తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు వరద ముంచెత్తింది. అండర్ టన్నెల్ లోకి వరద నీరు చేరింది. వెంకటాద్రి పంప్ హౌజ్ నీట మునిగింది. కీలకమైన మెషిన్లలోకి నీరు చేరడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా రూ.10 కోట్ల వరకు నష్టం ఏర్పడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వరద నీటిని బయటకు ఎత్తిపోస్తున్నామని వివరించారు. పంప్ హౌజ్ లో నుంచి నీటిని పూర్తిగా బయటకు పంపాకే నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేయొచ్చని తెలిపారు. రాష్ట్ర…