
తెలంగాణ పూల జాతర
తెలంగాణ అంటే బతుకమ్మ… బతుకమ్మ అంటే తెలంగాణ… తెలంగాణ రాష్ట్ర సంస్క్రృతీ సంప్రదాయలకు, ఆచారాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. అందమైన ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి విశిష్టతను కీర్తిస్తూ.. ఆనందంతో మురిసిపోయే క్షణాలకు వేదిక ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలు ప్రతియేటా మహాలయ అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్…