తిరుపతిలో ఫోక్సో కేసులో టీచర్ అరెస్ట్
తిరుపతి: బాలికపై మాయమాటలు చెప్పి లోబరుచుకున్న టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫోక్సో చట్టం కింద ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చెన్నంపల్లి ప్రాంతానికి చెందిన జలపతి రెడ్డి అనే వ్యక్తి ఓ ప్రైవేట్ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాలుగా ఆ బాలికతో అనుచిత సంబంధం కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే బాలిక తీరులో మార్పు గమనించిన తల్లిదండ్రులు నిలదీయగా, ఆమె అన్ని వివరాలు వెల్లడించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే…
