Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతిరుపతిలో ఫోక్సో కేసులో టీచర్ అరెస్ట్

తిరుపతిలో ఫోక్సో కేసులో టీచర్ అరెస్ట్

-

Chat on WhatsApp

తిరుపతి: బాలికపై మాయమాటలు చెప్పి లోబరుచుకున్న టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫోక్సో చట్టం కింద ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చెన్నంపల్లి ప్రాంతానికి చెందిన జలపతి రెడ్డి అనే వ్యక్తి ఓ ప్రైవేట్ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాలుగా ఆ బాలికతో అనుచిత సంబంధం కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే బాలిక తీరులో మార్పు గమనించిన తల్లిదండ్రులు నిలదీయగా, ఆమె అన్ని వివరాలు వెల్లడించడంతో షాక్‌కు గురయ్యారు.

వెంటనే వారు తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో విచారణ జరిపిన పోలీసులు నిందితుడు జలపతి రెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను కోర్టుకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది.

ALSO READ:ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp