T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన వివాదాలకు ఎట్టకేలకు తెరపడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ నిర్వహించనుంది. ఈ నెల 15న శ్రీలంక రాజధాని “కొలంబో వేదికగా” ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును పోటీలోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, ఐసీసీ ఆంక్షలు, ఆర్థిక నష్ట భయాల నేపథ్యంలో పాకిస్తాన్ యూ-టర్న్ తీసుకుంది. ఈ మొత్తం వివాదంలో “శ్రీలంక గేమ్‌ఛేంజర్‌గా మారింది”. భారత్–పాక్ మ్యాచ్ జరగకపోతే శ్రీలంకకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం రంగంలోకి దిగింది.
శ్రీలంక అధ్యక్షుడు “అనుర కుమార దిస్సానాయకే”, పాకిస్తాన్ ప్రధాని “షెహబాజ్ షరీఫ్” మధ్య సుమారు 30 నిమిషాల పాటు ఫోన్ చర్చలు జరిగాయి. శ్రీలంక విదేశాంగ శాఖ కూడా ఇస్లామాబాద్, కొలంబో హైకమిషన్ల ద్వారా పాక్ అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఈ ప్రయత్నాలను శ్రీలంక విదేశాంగ మంత్రి “విజిత హెరాత్” “క్రికెట్ డిప్లొమసీ”గా అభివర్ణించారు.
శ్రీలంకతో పాటు “బంగ్లా క్రికెట్ బోర్డు, యూఏఈ క్రికెట్ బోర్డు” కూడా పాక్‌పై ఒత్తిడి తెచ్చాయి. చివరకు పాక్ ప్రధాని భారత్‌తో మ్యాచ్ ఆడతామని ప్రకటించారు. మ్యాచ్ జరగనుండటంపై శ్రీలంక అధ్యక్షుడు సంతోషం వ్యక్తం చేశారు.
