Surat Fire Accident: గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఏడంతస్తుల టెక్స్‌టైల్ భవంతిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు ప్రారంభించారు.
సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక వాహనాలు సంఘటనాస్థలిలో పనిచేస్తున్నాయి. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు.
ALSO READ:Pm Modi on Uncliamed Assets | క్లెయిమ్ చేయని ఆస్తులపై మోదీ కీలక ప్రకటన
భవంతిలో గిడ్డంగి పనులు జరుగుతున్నాయని, లోపల పెద్ద మొత్తంలో వస్త్ర సామాగ్రి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని చెప్పారు.
సుమారు 100 నుంచి 125 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది కలిసి మంటలను అదుపు చేయడానికి భారీ స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
