లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Indian stock markets ended in green as global trade tensions eased. Sensex gained 294 points and Nifty closed at 24,461. Indian stock markets ended in green as global trade tensions eased. Sensex gained 294 points and Nifty closed at 24,461.

ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా వాణిజ్య ఘర్షణలు తగ్గుముఖం పడుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. అలాగే, భారత్–అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరే అవకాశాలపై ఆశలు మార్కెట్లను ఆకర్షించాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 294 పాయింట్లు పెరిగి 80,796కి చేరింది. అదే సమయంలో నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 24,461 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే ₹84.27గా కొనసాగుతోంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో అదానీ పోర్ట్స్ 6.29% లాభపడగా, బజాజ్ ఫిన్ సర్వ్ 3.73%, మహీంద్రా అండ్ మహీంద్రా 3.11%, ఐటీసీ 1.62%, టాటా మోటార్స్ 1.50% లాభపడ్డాయి. ఈ లాభాలు మార్కెట్‌కు మంచి ఊతమిచ్చాయి.

మరోవైపు, టాప్ లూజర్స్ జాబితాలో కోటక్ బ్యాంక్ (-4.57%), ఎస్‌బీఐ (-1.26%), టైటాన్ (-0.73%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.65%) మరియు యాక్సిస్ బ్యాంక్ (-0.64%) ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్లలో కొంత ఒత్తిడి కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *