చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని గ్రామానికి నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ పెద్ద కాపు గా,,, ఎన్నుకోబడి నా మెరుగు మోహన్ రెడ్డి, ముందుగా దసరా పండుగను పురస్కరించుకొని తన గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కుటుంబ సభ్యులతో కలిసి వైదిక అర్చకుల మంత్రాచరణ నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుకొని 60 వేల రూ// కుంభ కిరీటాన్ని వెంకటేశ్వర స్వామికి ఆవిష్కరించారు, బరంపూర్ గ్రామానికి పెద్ద కాపుగా ఏకాగ్రగంగా ఎన్నుకొని గ్రామస్తులు నియమించారు, ఈ సందర్భంగా గ్రామంలో దసరా పండుగను పురస్కరించుకొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల నడుమ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని గ్రామస్తులు సుఖసంతోషాల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారిని ప్రార్థించారు, అదేవిధంగా గ్రామంలో ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం మహిషాసుర మర్దిని దహన కార్యక్రమం చేపట్టి టపాకాయలు పేల్చారు గ్రామంలో కులాలకు అతీతంగా గ్రామస్తులు అందరూ కలిసి డబ్బు చప్పుళ్ల మధ్య పాలపిట్టను వీక్షించేందుకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు, దుర్గమ్మ వారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని పాడిపంటలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పిల్లలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దసరా పండుగ సందర్భంగా గ్రామ పెద్ద కాపు మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు
