2011 ప్రపంచ కప్ సమయంలో బెంగళూరులో ఉన్న తనకు సత్యసాయి బాబా ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) గుర్తు చేసుకున్నాడు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరైన సచిన్, ఈ ప్రత్యేక అనుభవాన్ని పంచుకున్నాడు.
ప్రజలను జడ్జ్ చేయకుండా అర్థం చేసుకోవాలని సత్యసాయి ఎప్పుడూ చెప్పేవారని, అలా చేస్తే సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని సచిన్ తెలిపారు.
ALSO READ:Owaisi on Suicide Blast: ఇస్లాంలో అలా లేదు-ఆత్మహుతి దాడులను ఖండించిన ఒవైసీ
ప్రజలకు సేవ చేయడం సత్యసాయి ఆశయం అని, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన జీవితాంతం శ్రమించారని సచిన్ అభిప్రాయపడ్డాడు. శారీరకంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు సత్యసాయి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని కొనియాడాడు.
వరల్డ్ కప్ సమయంలో సత్యసాయి పంపిన పుస్తకం తనకు సానుకూల దృక్పథాన్ని ఇచ్చిందని, ఆ ఏడాదే ట్రోఫీ(2011 World Cup) గెలవడం తన జీవితంలోని గోల్డెన్ మూమెంట్గా నిలిచిందని సచిన్ భావోద్వేగంగా గుర్తు చేసుకున్నాడు.
