సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడిన పార్టీగా కొనసాగుతున్నది అని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోలం రెడ్డి మల్లికార్జున, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగం సంజీవ్, రాష్ట్ర నాయకులు కొమ్మ ఎల్లయ్య అన్నారు. వారు శనివారం బోయినపల్లిలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ యువతకు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికి సముచిత స్థానం కేటాయిస్తామని వారు పేర్కొన్నారు.
రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలానికి చెందిన యువ నాయకుడు రేవూరి వేణుగోపాల్ గురించి వారు మాట్లాడారు. విద్యార్థి సంఘం నాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన రేవూరి వేణుగోపాల్ అనేక అడ్డంకులను ఎదుర్కొని దూసుకుపోయిన వ్యక్తి అని చెప్పారు.
ఈ సందర్భంగా, మాల మహానాడు నేతలు, నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసులు వద్ద రేవూరి వేణుగోపాల్ కు నామినేటెడ్ పదవి ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. తన నాయకత్వం మరియు కృషితో, పార్టీకి ఎంతో సేవ చేసిన వేణుగోపాల్ కు ఈ పదవి ఇవ్వాలని వారు కోరారు.