కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ ప్రజావాణి కార్యక్రమన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్నా దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సమాచారం అందించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు,
ఈ సోమవారం గార్ల మండలం,పుట్టకోటబజార్ కు చెందిన మోతుకూరి స్వరూపారాణి,తాను కొనుగోలు చేసిన ఇంటిని గ్రామపంచాయతీ రికార్డులోకి నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కే సముద్రం మండలం, బెరివాడ గ్రామానికి చెందిన, బానోతు పద్మ తనకు రుణమాఫీ కాలేదని, రుణమాఫీ చేయుటకు దరఖాస్తు చేసుకున్నారు.
నెల్లికుదురు మండలం, శ్రీరామగిరి గ్రామం కు చెందిన, ప్రశాంత్, నరేష్, కృష్ణ, ప్రవీణ్, వాస్తవ్యులు యూపీఎస్సీ స్కూల్ కి ప్రహరీ గోడ నిర్మాణం,మౌలిక వసతులు కల్పించాలని దరఖాస్తు చేశారు. కురవి మండలం, సుదనపల్లి కి చెందిన వై.చంద్రకళ, తనకు గృహజ్యోతి పథకం గ్యాస్ సబ్సిడీ రావడంలేదని పథకం అమలకు దరఖాస్తు చేసుకున్నారు.
కేసముద్రంకు చెందిన, మహమ్మద్ సర్వర్ ఖాన్, ఆసరా పెన్షన్ పథకం ద్వారా నూతన వృద్ధాప్య పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పెద్దవంగర మండలం పోచంపల్లికి చెందిన, కోటగిరి రజిత, తన భర్త ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ చనిపోయారని, ఆ ఉద్యోగం ఇప్పించుటకూ, దరఖాస్తు చేసుకున్నారు.
కేసముద్రంకు చెందిన పొనుగంటి విష్ణువర్ధన్, అమీనాపురం గ్రామంలో రేషన్ డీలర్ ను నియమించాలని, అంతర్గత రోడ్ల మరమ్మతులు, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రతి గ్రామంలో విలేజ్ లీగల్ సెల్ ఏర్పాటు చేయాలనీ, కేసముద్రంలో ప్రభుత్వ స్థలాలను పరిరక్షణకై బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. నెల్లికుదురు మండలం, వావిలాల గ్రామంకు చెందిన గోగుల.సోమలింగమ్మ, తనకు బోదకాలు ఉందని పెన్షన్ ఇప్పించుటకు దరఖాస్తు చేసుకున్నారు.
ఇలా తదితర విభాగాలకు చెందిన మొత్తం దరఖాస్తులు ( 91) వచ్చాయని, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఎడి ఎస్ఎల్ఆర్ నరసింహమూర్తి,డిపిఓ హరిప్రసాద్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహ స్వామి, డివిహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, ఆర్అండ్బి ఈఈ బీమ్లా నాయక్, డిడి గ్రౌండ్ వాటర్ సురేష్, డిహెచ్ఓ మరియన్న, జిల్లా మైన్స్ అధికారి వెంకటరమణ, డిఎస్ఓ ప్రేమ్ కుమార్, డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.