కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నివేదికల సమర్పించాలని వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులను రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం ఆదేశించారు. గురువారం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాల్లో ఏడు మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలతో, ఉపాధి హామీ పథకం ఏపీడీ తో, ఉపాధి హామీ పథకం ఏపీఓ లతో, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లతో, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో, గ్రామీణ త్రాగునీటి అధికారులతో, అన్ని సచివాలయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో, స్పెషల్ మైనర్ ఇరిగేషన్ ఇంజనీర్లతో, అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతి నివేదికలు సమర్పించే విధంగా ప్రాజెక్ట్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం మాట్లాడుతూ ఏజెన్సీ ఏడు మండలాల పరిధిలో గల మారుమూల గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్లు, జన్మన్ పథకం ద్వారా టీవీ టీజీలకు మంజూరైన గృహాలు సకాలంలో పూర్తి చేయాలని అదేవిధంగా వివిధ గిరిజన తెగలకు మంజూరైన గృహాలు సకాలంలో పూర్తి చేయాలని ప్రాజెక్టు అధికారి ఆదేశించారు. పి వి టి జి లకు జన్మాన్ పథకం ద్వారా ఎన్ని కుటుంబాలకు ఎన్ని కరెంటు మీటర్లు ఏర్పాటు చేసింది ఆయన ఆరా తీశారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా మారుమూల గ్రామాలకు ఎన్ని లింక్ రోడ్లను గుర్తించింది అదేవిధంగా గిరిజనులకు ఉపయోగపడే విధంగా గిరిజనుల అవసరం కోసం ఎన్ని భవనాలు గుర్తించింది ఆయన ఆరా తీశారు. స్పెషల్ మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా కొత్తగా సాగునీటి చెక్ డాములు ఎన్ని గుర్తించింది అదేవిధంగా ఎన్ని చెక్ డాం లకు మరమ్మత్తులు చేయవలసి ఉన్నది ఆయన ఆరా తీశారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు సైతం త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఎన్ని పనులు గుర్తించింది అదేవిధంగా ఎన్ని వాటర్ ట్యాంకులు కొత్తవి గుర్తించింది ఆయన ఆరా తీశారు. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఎన్ని రోడ్లు కొత్తవి గుర్తించింది అదేవిధంగా ఎన్ని లింక్ రోడ్లు గుర్తించింది మండలాల వారిగా ప్రాజెక్ట్ అధికారి ఆరా తీశారు. ఏజెన్సీలోని ఏడు మండలాలకు సంబంధించిన గ్రామ సచివాలయాలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు. ఏజెన్సీలోని ఏడు మండలాల్లో వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన కొత్త పనులకు ప్రతిపాదనలు అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అదేవిధంగా గతంలో ఏర్పాటుచేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన భవనాలు మరమ్మత్తులు ఉన్న వాటిని గుర్తించి మండలాల వారిగా ఈనెల 14 నాటికి నివేదికల సమర్పించాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం మంజూరైన గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించిన ఇంజనీర్ల సమస్యలు ఉన్న ఎడల మా దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన ఇంజనీర్లు అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డి ఎన్ వి రమణ, మొబైల్ మెజిస్ట్రేట్ జాన్ రాజ్, ఉపాధి హామీ పథకం ఏపీ డి జి. శ్రీనివాసరావు, పిఏఓ ఎల్. రాంబాబు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఐ. శ్రీనివాసరావు, రవికుమార్, ఎంపీడీవోలు వీర కిషోర్, హరికృష్ణ, మడకం బాపన్న దొర, యాదగిరి ఈశ్వరరావు, పిఓపిఆర్డి జాన్ మిల్టన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చైతన్య, గౌతమి, సాయి సతీష్, రామచంద్ర మూర్తి, శ్రీనివాసరావు, స్వామి, శివ, ఉపాధి హామీ పథకం ఏపీఓలు సత్యనారాయణ,ప్రకాష్, సురేష్, అరవాలు, సాయిబాబా, రెడ్డి బాబు, స్వామి అన్ని మండలాలకు సంబంధించిన గ్రామ సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఐటిడిఏలో అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశం
