Friday, July 17, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJUగంగవరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

గంగవరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

-

Chat on WhatsApp

గంగవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు.
గురువారం అర్చకులు సాయి చక్రధర్ ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్ల నాగేశ్వరరావు శ్రీమతి కళ్యాణి దంపతులచే కలశపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ పది రోజులు ఆలయంలో అమ్మవారిని రకరకాల రూపాలతో అలంకరిస్తూ లక్ష కుంకుమార్చన, అగ్ని హోమం పూజలు, నిర్వహిస్తామని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకోవాలని ఆయన అన్నారు. మండల కేంద్రంలో దేవీనవరాత్రులు రంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , రమేష్, కిషోర్ సూరిబాబు, శ్రీను దొర, అబ్బాయి దొర, శేషాచార్యులు, రమణ ఆలయ కమిటీ కుర్రోళ్ళు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Crowd at Puri Jagannath Rath Yatra after a stampede incident in Odisha

Puri Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్రలో విషాదం.. 120 మందికి పైగా...

ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra) సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుని భక్తుల్లో విషాదాన్ని నింపింది. రథయాత్రను వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో రద్దీ అదుపుతప్పి తొక్కిసలాట ఏర్పడింది. ఈ...
- Advertisement -
Chat on WhatsApp