పెందుర్తి రాతి చెరువులో టిడ్కో ఇళ్ళాలో నివాసముంటున్న ప్రజల ఆవేదన.. తమకి ఇల్లులు ఇచ్చిన 2 సంవత్సరాలకే గోడలు చాలాచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని చిన్న వర్షం వచ్చినా ఇళ్ళులు కారిపోతున్నాయని , వాటి వలన ఇళ్లల్లో కనీసం నివసించలేకపోతున్నామని, వర్షం వచ్చిన ప్రతిసారి గోడలు కూడా కరెంట్ షాక్ కొడుతున్నాయని.. ఏ సమయంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియటం లేదని నాణ్యత లోపం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
లబ్ధిదారులు ఒక్కొక్కరు సుమారు లక్ష రూపాయలు చొప్పున డీడీలు రూపంలో చెల్లించామని మరియు ప్రతి నెల 4200 రూపాయలు చొప్పున సుమారు 18 సంవత్సరాలు బ్యాంకు ప్రతినెల ఈఎంఐ చెల్లించాలని. ఒక్క నెల ఆలస్యమైనా బ్యాంకు వారు నోటీసులు పంపుతున్నారని , నాణ్యత లోపంతో కట్టిన ఇల్లులు 18 సంవత్సరాలు ఉంటాయో లేవో తెలియదు గానీ మేము మాత్రం ప్రతినెల 4200 రూపాయలు చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతున్నామని అధికారులు తక్షణమే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరారు.