పాలేరు జలాశయంలో ఉచిత చేప పిల్లల విడుదల

In Khammam district, Minister Ponguleti Srinivasa Reddy released free fish seeds at the Paleru Reservoir, ensuring support for fishermen affected by the recent rains and promising additional assistance. In Khammam district, Minister Ponguleti Srinivasa Reddy released free fish seeds at the Paleru Reservoir, ensuring support for fishermen affected by the recent rains and promising additional assistance.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లలని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి రామసాహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర మత్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్, నీటి పారుదల చైర్మన్ మువ్వా విజయ బాబు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కుల వృతులని ప్రోచిహించే దానిలో భాగంగా మత్య కారులకి ఉచిత చేప పిల్లలని పంపిణీ చేస్తోందని అన్నారు. వర్షానికి మాత్యకారుల వలలు, తెప్పలు కొట్టుకొని పోయాయని, వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామని, చేప పిల్లలతో పాటు, రొయ్య పిల్లలని కూడా త్వరలోనే ఇప్పిస్తామని అన్నారు. వర్షానికి నష్ట పోయిన మత్యకరులకి ఇండ్లు కూడా ఇప్పిస్తామని అన్నారు. ఇచ్చిన ప్రతి మాట ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చేలా చేస్తానని ఆయన అన్నారు.

బైట్: పొంగులేటి శ్రీనివాసరెడ్డి – రెవిన్యూ శాఖ మంత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *