ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకసార్ గ్రామంలోని లంకాసర్ ప్రాజెక్టులో mla రాగమయి దయానంద్ మరియు జిల్లా మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులతో కలిసి 60 లక్షల చాప పిల్లలను 100% రాయితీతో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి చాప పిల్లలను వదిలారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదల కారణంగా చాప పిల్లల పంపకం లేట్ అయిందని ఇప్పుడు దీపావళి పండుగను పురస్కరించుకొని దీపావళి కానుకగా మత్స్యకారులకు చాప పిల్లలను అందించారు అనంతరం ఎమ్మెల్యే మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారి సమస్యలను సాదరంగా విని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా మత్స్యకారులందరూ ఐక్యతగా ఉండాలని సూచించారు అనంతరం పెనుబల్లి మండలంలోని కుప్పెనగుంట్ల గ్రామంలో సన్న రకం వరిధాన్య కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పండించిన సన్న రకం వరి ధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు బోనస్ అందిస్తున్నట్లు రైతులకు తెలియజేశారు ఏకకాలంలో రైతుల రుణం 2 లక్షల రుణమాఫీని తమ ప్రభుత్వం చేసిందని అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ల సూచనలు సహాయం తో మంచి దిగుబడులను ఇచ్చే పంటలను ప్రోత్సహించాలని చెప్పారు రైతులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే అన్నారు.
లంకసార్ ప్రాజెక్టులో 60 లక్షల చాప పిల్లలు విడుదల
