Telangana News: హైదరాబాద్‌ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో అనుసంధానం చేసే కీలకమైన “రతన్‌టాటా రోడ్డు”(Ratan Tata Road) నిర్మాణ పనులు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. 300 అడుగుల 100 Meters వెడల్పుతో రూపొందుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మొత్తం 41.50 కిలోమీటర్ల మేర విస్తరించనుంది.
రావిర్యాల ORR ఎగ్జిట్ 13 నుంచి అమన్‌గల్ వద్ద రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వరకు ఈ మార్గం నిర్మించబడుతోంది. మొదట 6 లేన్లుగా నిర్మించే ఈ రహదారిని భవిష్యత్‌లో 8 లేన్లుగా విస్తరించే ప్రణాళిక ఉంది.
ALSO READ:Uttar Pradesh Cough Syrup | దగ్గు సిరప్ అక్రమ రాకెట్‌పై ఈడీ దాడులు..పరారీలో ప్రధాన నిందితుడు
భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City) అభివృద్ధి కోసం కీలకమైన ఈ హైవే కొంగరఖుర్దు, ఫిరోజ్‌గూడ, లేమూర్, పంజగూడ మీదుగా మీర్‌ఖాన్‌పేట వరకు చేరుతుంది. అక్కడి నుంచి ముచ్చెర్ల, కడ్తాల్, చివరగా అమన్‌గల్ వద్ద ఆర్ ఆర్ ఆర్ ను కలుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాలు, 14 గ్రామాలకు నేరుగా అనుసంధానం కానుంది. మొత్తం 916 ఎకరాల భూసేకరణ అవసరమైన ఈ ప్రాజెక్టులో 568 ఎకరాలు పట్టా భూములు.
కొంతమంది రైతులు అంగీకారం తెలపకపోవడంతో అధికారులు ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లో మాత్రమే పనులు చేపట్టారు. రైతులు అంగీకారం తెలిపిన తర్వాత మిగతా భూసేకరణ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.
