రాష్ట్రంలో రైతుల కోసం కొత్తగా ‘రైతన్నా మీ కోసం’ (Raitanna Mee Kosam)అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ప్రారంభించనుంది. రైతులకు ప్రత్యక్ష లాభాలు అందించే ఐదు ప్రధాన సూత్రాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.
ALSO READ:KTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత
నవంబర్ 24 నుంచి 29 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోని రైతు ఇళ్లకు వెళ్లి పంట ఎంపిక, లాభదాయక పంటలు, సరైన సాగు విధానాలు, ప్రమాద నివారణ, ప్రభుత్వ సహాయక పథకాలపై వివరించనున్నారు.
రైతుల నిర్ణయాలు శాస్త్రీయంగా, లాభదాయకంగా మారేందుకు ఈ సందర్శనలను కీలకంగా పరిగణిస్తున్నారు. డిసెంబర్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు సేవా కేంద్రాల్లో వర్క్‌షాపులు నిర్వహించి నిపుణుల సూచనలు అందజేయనున్నారు.
ఈ కార్యక్రమం రైతులకు ప్రత్యక్ష మేలు చేస్తుందని, వ్యవసాయ రంగంలో కొత్త అవగాహన తీసుకువస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
