Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadKTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత

KTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత

-

Chat on WhatsApp

ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Case) కేసులో KTR పై  ఛార్జ్ సీట్ ఫైల్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే గవర్నర్ అనుమతితో  రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నిర్ణయంపై  తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు .

ఇతర నేతలపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పనిలేదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కవిత మండిపడ్డారు.

ALSO READ:కుప్పం ప్రజలకు అండగా నిలబడతా నారా భువనేశ్వరి

ఈ వైఫల్యం కారణంగా బస్తీల్లో ప్రజలను ఎదుర్కోగల ధైర్యం కూడా కాంగ్రెస్ నేతలకు లేదని ఆమె పేర్కొన్నారు.

ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్ష నేతలపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని కవిత ఆరోపించారు. దేశంలో కుట్రపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.

న్యాయం, చట్టం ఉన్న దేశంలో ఇలాంటి రాజకీయ కుట్రలు నిలవవని, ప్రజలు దానికి తగిన సమాధానం ఇస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తాము నంబర్ వన్ స్థానంలో ఉన్నారని, మిగతా పార్టీలు 2, 3, 4 స్థానాల్లోనే కొనసాగుతాయని ఆమె వ్యాఖ్యానించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nagabandham The Secret Treasure movie poster featuring Virat Karna and Nabha Natesh

Nagabandham | ‘నాగబంధం’ ఓటీటీ ఎంట్రీ.. ఎక్కడ? ఎప్పటి నుంచి?

Nagabandham: థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే మరో తెలుగు సినిమా ఓటీటీ బాట పట్టింది. ఫాంటసీ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కిన 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రధాన పాత్రల్లో విరాట్ కర్ణ,...
- Advertisement -
Chat on WhatsApp