ఆకాశమే హద్దుగా యువతకు అవకాశాలు వస్తాయని, మహేశ్వరం నియోజకవర్గంలో గల రఘువంశీ ఏరోస్పెస్ యూనిట్ తయారీ కేంద్రాన్ని శంకుస్థాపనను చేస్తున్న నేపథ్యంలో, మంత్రి శ్రీధర్ బాబుఈ మాటలను ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత దశాబ్దన్నర కాలంలో ఏరోస్పెస్ లో అపారమైన అవకాశాలు వచ్చాయని, ఆకాశమే హద్దుగా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు డిఫెన్స్, వైమానిక రంగాల్లో ఎదిగేందుకు అవకాశం ఉందని, అలాగే ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి గ్రామంలోని హార్డ్ వేర్ పార్క్ లో రఘువంశీ ఏరోస్పెస్ తయారీ యూనిట్ కేంద్రాని శంకుస్థాపన చేశానని ఆయన పేర్కొన్నారు.
అనంతరం మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి( KLR) మాట్లాడుతూ… మహేశ్వరం నియోజకవర్గంలో హార్డ్ వేర్ పార్క్, ప్యాబ్ సిటీ, ఫోర్త్ సిటీ అనేక అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయని.. అందువల్ల స్థానిక యువతీయువకులకు బోలెడన్నీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, కంపెలకు తగినట్లు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలని ఆయన సూచించారు. తదనంతరం చైర్మన్ రఘు వంశీ మాట్లాడుతూ….రఘువంశీ ఏరోస్పెస్ ను 20 ఏళ్ల క్రితం 10 మంది ఉద్యోగులతో తన తండ్రి ప్రారంభించారని,నేడు 2000 మందికి ఉపాధి కల్పించే సంస్థగా ఎదగటం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో TSIIC MD విష్ణువర్ధన్ రెడ్డి, ఏరోస్పెస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, DRDO శాస్త్రవేత్త యు. రాజబాబు, భారత్ బయోటిక్ CII & ED ఛైర్మన్ సాయి ప్రసాద్ సహా కంపెల ప్రతినిధులు పాల్గొన్నారు.
