విత్తన బంతులతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయండి అని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ నందిని సలారియ పిలుపునిచ్చారు. వన్యప్రాణి వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని జంతు ప్రదర్శన శాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ ప్రతినిధులతో అక్షర స్కూల్, శ్రీ భావన విద్యా నికేతన్, ది గ్లోబ్ స్కూల్ , పాలమూరు యూనివర్సిటీకి చెందిన ఎంఎస్ డబ్ల్యు విద్యార్థులతో సీడ్ బాల్స్ తయారు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం, సమస్త జీవరాశినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదె అని అవ గాహన కలిగించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ విద్యార్థులు తాము భుజించిన పండ్లు లోని గింజలు ఆరబెట్టి సీడ్ బాల్స్ తయారు చేసి కొండల్లో, బంజరు భూముల్లో, సముద్ర తీరం ప్రాంతంలో చల్లాలని కోరారు. ఏ విత్తనమూ వృదా కాకూడదు అన్నారు.
ఈ కార్యక్రమంలో జ్యు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దివ్య, పర్యావరణ ప్రచారకులు భూషణం మాస్టారు, గ్రీన్ క్లైమేట్ టీం కోఆర్డినేటర్ లు జె. రవితేజ, ఐ. కృష్ణ కుమారి తదితరులు మాట్లాడారు.
విత్తన బంతులతో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం
Indira Gandhi Zoological Park's curator, Nandini Salari, emphasized environmental conservation through seed ball preparation, urging students to live sustainably.
