కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ షర్మిల చంద్రబాబుతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డుకు ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలోనే షర్మిలమ్మక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు పంపకాలు చేశారు. పెళ్లయి 20 ఏళ్ల దాటుతుంటే ఇప్పుడు వాటా ఎలా వస్తుంది. షర్మిల జగన్ కు చెల్లెలు అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన వ్యాపారాల ద్వారా సాక్షి పత్రిక భారతదేశం వ్యాపారాల్లో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సంపాదించుకున్న డబ్బులు నుంచి 200 కోట్లు నగదు డబ్బులు జగన్ని ఇచ్చారు. ప్రేమతో మరికొన్ని ఆస్తులు ఇచ్చేందుకు జగన్ ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేందుకు భారతమ్మ ఒపుకుందంటే భారతమ్మను రెండు చేతులెత్తి మొక్కాలి. జగన్ నేషనల్ కంపెనీలా ట్రిబ్యునల్కు పోయాడు కోర్టుకు పోలేదు కాబట్టి షర్మిలమ్మ నిజాలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి పై నిందలు ఆపాదించకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గౌరవంగా ఉండే విధంగా శరీరంలో చూడాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచముల శివప్రసాద్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్, భీమనపల్లి లక్ష్మీదేవి మండలాధ్యక్షుడు శేఖర్ యాదవ్ వైఎస్ఆర్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
షర్మిల వ్యాఖ్యలపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్పందన
