Poco M8 5G Sale: పోకో (Poco) నుంచి తాజాగా విడుదలైన Poco M8 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. గత వారం లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలుకు లభిస్తోంది.
Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చింది.
Poco M8 5G మూడు వేరియంట్లలో లభిస్తోంది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించగా, 8GB + 128GB వేరియంట్ ధర రూ.19,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.21,999గా ఉంది.
ALSO READ:AI రేస్‌లో కీలక మలుపు | ఆపిల్–గూగుల్ మధ్య కీలక ఒప్పందం…మస్క్ తీవ్ర ఆందోళన
అయితే లిమిటెడ్ పీరియడ్ లాంచ్ ఆఫర్‌తో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.15,999కి తగ్గింది. మిగతా వేరియంట్లు వరుసగా రూ.16,999, రూ.18,999కు లభిస్తున్నాయి. ఈ ఆఫర్ జనవరి 13 అర్ధరాత్రి వరకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 లాంచ్ బెనిఫిట్‌తో పాటు HDFC, ICICI, SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2,000 తక్షణ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
ఫీచర్ల విషయానికి వస్తే, Poco M8 5Gలో 6.77 అంగుళాల ఫుల్ HD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది.
ఇది Android 15 ఆధారిత HyperOS 2.0పై పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 20MP ఫ్రంట్ కెమెరా, 5,520mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.
