Budget 2026 Sessions: గురువారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ(Pm Modi) రాజ్యసభలో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ, యూరోపియన్ యూనియన్, అమెరికా సహా అంతర్జాతీయ ట్రేడ్ డీల్స్ వివరించారు.
దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ గొంతుగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ గతంలో చేసిన తప్పులపై విమర్శిస్తూ, అభివృద్ధి మెల్లగానే నిలిచిందని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభమయ్యగానే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై సెటైర్లు వేశారు. ఖర్గే తన స్థానంలో నిలబడి నినాదాలు చేయగా, మోడీ ‘‘వయసు దృష్ట్యా కూర్చుని నినాదాలు చేయవచ్చు’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేసారు. విపక్షాలు ఆలస్యంచేయకుండా వెళ్లిపోయాయి అని ప్రధాని వ్యంగ్యాస్త్రాలతో పరిస్థితిని హాస్యంగా మార్చారు.
ALSO READ:Stock Market | నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ & nifty loss
