ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ(Pm narendramodi) రానున్నారు . శతాబ్ది(Sathya Sai Baba Centenary) ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేకంగా పుట్టపర్తికి చేరుకుంటున్నారు.
ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రధాని శ్రీ సత్య సాయి బాబా(Sathya Sai Baba) మహా సమాధిని సందర్శించి నివాళి అర్పించనున్నారు. అనంతరం 10.30 గంటలకు జరుగనున్న సత్యసాయి శత జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సత్య సాయి బాబా జీవితం, సేవా కార్యక్రమాలు, వారసత్వానికి గుర్తింపుగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంపు మరియు స్మారక నాణెన్ని ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు.
తరువాత సత్యసాయి సేవలు, ఆధ్యాత్మిక విశిష్టత, సంస్థ కార్యకలాపాల పట్ల తన అభిప్రాయాలను తెలియజేస్తూ భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పుట్టపర్తి ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయగా, వేలాది మంది భక్తులు PM సందర్శన కోసం ఎదురుచూస్తున్నారు.
ALSO READ:Urban Naxals Issue: అర్బన్ నక్సలైట్లను నమ్మి మోసపోవద్దు:బండి సంజయ్
