Parliament winter session 2025: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ(lok sabha), రాజ్యసభల్లో(Rajya sabha) కార్యకలాపాలు మొదలుకానున్నాయి.
ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం ప్రకటించనున్నాయి. అనంతరం సాధారణ చర్చలు, బిల్లుల ప్రవేశపెట్టడం, ప్రశ్నోత్తరాలు వంటి కార్యక్రమాలు కొనసాగుతాయి.
ALSO READ:ఫ్లయింగ్ స్క్వాడ్ బెంగతో కాపీయింగ్ వెలుగులోకి | Osmania Degree Exam Mass Copying Incident
ఈసారి Winter Session వాతావరణం రాజకీయంగా హోరాహోరీగా ఉండనున్నట్లు అంచనా. ప్రభుత్వం తీసుకురాబోయే బిల్లులు, ప్రతిపక్షం లేవనెత్తే అంశాలు, ఆర్థిక-సామాజిక చర్చలతో సభలు చురుకుగా సాగనున్నాయి. ముఖ్యంగా ప్రజా విధానాలు, ఆర్థిక వ్యవహారాలు, జాతీయ భద్రత, అభివృద్ధి కార్యక్రమాలపై విశేష దృష్టి కేంద్రీకరించబడనుంది.
మొత్తం 15 రోజులపాటు జరిగే ఈ సమావేశాలపై దేశవ్యాప్తంగా దృష్టి నిలిచింది.
