పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పెద్ద అనర్థం తప్పింది. హైదరాబాద్ నుంచి బాపట్లకు బయలుదేరిన బస్సు రెడ్డిగూడెం వద్దకు చేరుకునే సమయానికి రోడ్డు విస్తరణ పనుల కోసం ఏర్పాటు చేసిన భారీ పైపులకు ఢీకొంది.
ఢీ కొట్టిన ప్రభావంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. సంఘటన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రయాణికులు అత్యవసర ద్వారం ద్వారా వెంటనే బయటకు దిగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదం సమయంలో బస్సులో స్వల్ప గాయాలతో కొందరు తప్పించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రోడ్డు విస్తరణ పనుల సమయంలో సరైన సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ALSO READ:CSK జడేజా స్థానంలో సంజు సామ్‌సన్?..జడేజా ఇన్‌స్టా అకౌంట్ ఏమైంది
