Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadహైదరాబాద్‌లో గంజాయి మత్తులో రచ్చ – ప్రైవేట్ బస్సుపై యువకుల దాడి

హైదరాబాద్‌లో గంజాయి మత్తులో రచ్చ – ప్రైవేట్ బస్సుపై యువకుల దాడి

-

Chat on WhatsApp

హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేట సమీపంలోని మెట్రో పిల్లర్ నెంబర్ 1629 వద్ద గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుల గ్యాంగ్ రచ్చకెక్కింది.

మత్తు ప్రభావంలో తూలుతూ నానా హంగామా సృష్టించిన వారు రోడ్డుపై నిలిపి ఉన్న ప్రైవేట్ బస్సుపై దాడి చేశారు. కర్రలతో బస్సు గాజు తలుపులు, కిటికీలను పగలగొట్టారు. ఈ దాడిని స్థానికులు చూస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారే తప్ప ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.

also read:Palnadu Bus Accident: పల్నాడు జిల్లా లో ప్రైవేట్ బస్సుకు తప్పిన ప్రమాదం 

ఆ సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బంది కూడా లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పటాన్‌చెరు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న ఆ బస్సు డ్రైవర్ యూ-టర్న్ తీసుకునే సమయంలో తమ కారును ఢీకొట్టాడని గ్యాంగ్ వాదించింది. ఆ తర్వాత బస్సు డ్రైవర్‌పై కూడా దాడి చేశారు.

ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చైతన్యపురి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి, దాడి చేసిన గ్యాంగ్‌పై కేసు నమోదు చేశారు.

యువతలో పెరుగుతున్న మత్తు వ్యసనంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp