పహల్గామ్ దాడి అనంతరం పాక్ వీసాలు రద్దు

After the Pahalgam attack, India cancelled Pak citizens’ visas, giving them 72 hours to leave the country. After the Pahalgam attack, India cancelled Pak citizens’ visas, giving them 72 hours to leave the country.

పహల్గామ్ దాడి ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. 72 గంటల్లోగా వారు స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ గడువును విధించింది. సాధారణ వీసాల గడువు ఆదివారంతో ముగియగా, వైద్య వీసాల గడువును మంగళవారం వరకు పొడిగించారు.

ఈ చర్యల నేపథ్యంలో, వీసా గడువు పూర్తయిన తరువాత కూడా దేశం విడిచి వెళ్లని పాక్ పౌరులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, విదేశీయులు గడువు మించి దేశంలో ఉంటే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 27, 2025 నుంచి పలు వీసాల రద్దు అమలులోకి రాగా, వైద్య వీసాలకు ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చారు. సుమారు 12 రకాల వీసాలు కలిగిన పాకిస్థాన్ పౌరులు ఆదివారంలోపు దేశం విడిచి వెళ్లాలని సూచించారు.

గత మూడు రోజులుగా అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారీగా ప్రజల తరలింపు చోటుచేసుకుంది. శుక్రవారం నుంచి 509 మంది పాక్ పౌరులు భారత్ విడిచి వెళ్లగా, అదే సమయంలో పాకిస్థాన్‌లో ఉన్న 745 మంది భారతీయులు కూడా తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *