వన్‌ప్లస్ 13, 13ఆర్ లాంచ్‌కు రెడీ! జనవరి 7 విశేషాలు!

OnePlus to launch OnePlus 13, 13R phones with premium features, and Buds Pro 3 on January 7 in India. Prices may range from ₹67,000 to ₹70,000. OnePlus to launch OnePlus 13, 13R phones with premium features, and Buds Pro 3 on January 7 in India. Prices may range from ₹67,000 to ₹70,000.

స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్, భారత మార్కెట్‌లో మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేయనుంది. జనవరి 7న జరగనున్న ‘వింటర్ ఈవెంట్‌’లో వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్లను ప్రవేశపెడుతుంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్లకు మంచి ఆదరణ లభించడంతో, ఇప్పుడు భారత మార్కెట్‌లోనూ ఇవి ప్రీమియం కేటగిరీలో అదరగొట్టనున్నాయి. ధరలు రూ.67,000 నుంచి రూ.70,000 వరకు ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 13 ఫీచర్ల విషయానికి వస్తే, 6.82-అంగుళాల డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. నూతన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం ముందుకు, వెనుకకు అధిక సామర్థ్యాలు కలిగిన కెమెరా సెటప్‌లు ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ జూమ్ సామర్థ్యాన్ని పెంచుతూ, ఫొటోల నాణ్యతను మరింత మెరుగుపరుస్తుంది.

ఈ ఫోన్ 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. దీని పక్కనే కంపెనీ జనవరి 7న కొత్త ‘వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3’ని కూడా ఆవిష్కరించనుంది. అధునాతన ఫీచర్లతో, మెరుగైన హార్డ్‌వేర్‌తో ఈ బడ్స్ వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి.

వన్‌ప్లస్ తన వినియోగదారుల కోసం అత్యాధునిక సాంకేతికతతో పాటు స్టైలిష్ డిజైన్‌ను కలిపి మరింత ఆకర్షణీయమైన గాడ్జెట్లను అందించనుంది. భారత మార్కెట్లో వినియోగదారుల నుంచి ఈ సరికొత్త ఉత్పత్తులకు విశేష స్పందన ఉంటుందని ఆశిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *