హాస్టల్‌లో జరిగిన సంఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయి. ఈ ఫింగర్ ప్రింట్స్‌ని పరిశీలించి, అది హాస్టల్ మెస్‌లో పనిచేసే వ్యక్తులకు చెందని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో 5 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్దున్న 12 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.
నిన్నటి నుంచి పోలీసులు మరియు టెక్నికల్ టీం ఈ ఫోన్లను అనేక విధాలుగా పరిశీలించారు. అయితే వాటిలో ఎలాంటి వీడియోలు లేదా ఫోటోలు లభించలేదు. ఒకవేళ డిలీట్ చేసి ఉంటారని భావించి, ఈ ఫోన్లన్నీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.
ఇప్పటివరకు హాస్టల్ యాజమాన్యం నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదు. యాజమాన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులో లేకపోవడం విచారంగా ఉంది. హాస్టల్ పరిసరాలు పరిశీలించిన తర్వాత, యాజమాన్యంపై సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని పోలీసులకు స్పష్టమైంది.
విద్యార్థులతో స్టేట్మెంట్లు రికార్డ్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మొత్తం విచారణలో యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నామని పోలీసులు తెలిపారు.