ఎన్సీఆర్సి ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్కుల భరణం నరసింహారావు హాజరయ్యారు. వివిధ వాణిజ్య రంగ ప్రతినిధులు, మోడల్స్, ఇతర రంగాల ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఎన్సీఆర్సి ఫౌండర్ డాక్టర్ నాగేశ్వరరావు గారు, తెలంగాణ స్టేట్ చైర్మన్ భునేడు బాలరాజ్, మహిళ చైర్మన్ మార్కెట్ తెలంగాణలో తొలి మహిళగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మహిళా కమిటీ డైరెక్టర్ శ్రీలక్ష్మీ నాయకత్వంలో మహిళల ప్రోత్సాహానికి అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
తెలంగాణ వర్కింగ్ చైర్మన్ భాస్కర్ పవర్, స్పోకెన్ పర్సన్ జ్యోత్స్న నాయక్, నేషనల్ వైస్ చైర్మన్ కే మల్లేష్ రావు, కమ్యూనికేషన్ చైర్మన్ హరి గోపాల్ దత్తు, ఉమ్మడి మహబూబ్నగర్ చైర్మన్ మడుగు శివశంకర్ లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు సమష్టిగా పనిచేస్తూ ఎన్సీఆర్సి కుటుంబాన్ని మరింతగా విస్తరించాలని కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నూతన సభ్యులను చేర్చడం, వాణిజ్య రంగంలో ప్రతిభ చూపినవారికి అవార్డులు అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఎన్సీఆర్సి సంస్థ మరిన్ని కార్యక్రమాలను చేపట్టి మహిళలకు, వాణిజ్య రంగానికి ప్రోత్సాహం అందించేందుకు సంకల్పం వ్యక్తం చేసింది.