గంగవరంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు.
గురువారం అర్చకులు సాయి చక్రధర్ ఆధ్వర్యంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్ల నాగేశ్వరరావు శ్రీమతి కళ్యాణి దంపతులచే కలశపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ పది రోజులు ఆలయంలో అమ్మవారిని రకరకాల రూపాలతో అలంకరిస్తూ లక్ష కుంకుమార్చన, అగ్ని హోమం పూజలు, నిర్వహిస్తామని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకోవాలని ఆయన అన్నారు. మండల కేంద్రంలో దేవీనవరాత్రులు రంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , రమేష్, కిషోర్ సూరిబాబు, శ్రీను దొర, అబ్బాయి దొర, శేషాచార్యులు, రమణ ఆలయ కమిటీ కుర్రోళ్ళు తదితరులు పాల్గొన్నారు.
గంగవరంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
