మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఈ నెల 9వ తేదీన రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా చేపట్టనున్న ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతారని ఆమె తెలిపారు. బుధవారం ధర్నాకు సంబంధించిన స్థల పరిశీలన చేశారు. పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌడ శంకర్ గుప్తా, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మండల యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, సి డి సి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యం గారు సంతోష్ కుమార్, కొరబోయిన కాశీనాథ్, చిట్యాల యాదయ్య, తుక్కాపూర్ ఆంజనేయులు, పాండ్ర వెంకటేశం,ఆరే రవీందర్,సురేష్ గౌడ్,ఏడుపాయల మాజీ డైరెక్టర్ గౌరీ శంకర్, యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి, సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
కోల్చారం మండలంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్న నర్సాపూర్ ఎమ్మెల్యే
