కుప్పం ప్రజలకు అండగా నిలబడతా నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari conducting public darbar during Kuppam visit Nara Bhuvaneswari conducting public darbar during Kuppam visit

Kuppam Public Darbar:కుప్పం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలబడతా అని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
కుప్పం పర్యటనలో భాగంగా రెండొవరోజు నారా భువనేశ్వరి శాంతిపురం నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక ప్రజలు తమ అర్జీలను సమర్పించగా, సమస్యల పరిష్కారానికి అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పర్యటనను స్వాగతించారు.

ALSO READ:Helmet Safety Awareness: హెల్మెట్ ధరించు.. స్వీట్ తిను


కుప్పం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలబడి ఉంటానని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. అలాగే, కుప్పం నియోజకవర్గం తరఫున స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను అభినందించారు. దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలను ప్రయోజనదారులకు పంపిణీ చేశారు.

పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమై సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే దిశగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *