Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం

Launch services between Nagarjuna Sagar and Srisailam Launch services between Nagarjuna Sagar and Srisailam

నాగార్జున సాగర్–శ్రీశైలం మధ్య లాంచ్ సర్వీసులు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. పర్యాటకాభివృద్ధి దృష్ట్యా తిరిగి ప్రారంభిస్తున్న ఈ సేవలకు కొత్త టికెట్ రేట్లు కూడా విడుదలయ్యాయి.

పెద్దలకు వన్‌వే ప్రయాణానికి రూ.2,000, రెండు వైపులా ప్రయాణానికి రూ.3,250గా అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలకు (వయసు 5 నుంచి 10) వన్‌వే ప్రయాణం రూ.1,600, రెండు వైపులా ప్రయాణం రూ.2,600గా టికెట్ ధరలు ఖరారు చేశారు.

ALSO READ:RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ ట్వీట్…దేవుణ్ని నమ్మకపోవడం కూడా హక్కే

పర్యాటకులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని, బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్‌లో సదుపాయం అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

టికెట్ బుకింగ్ కోసం https://tgtdc.in/home వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.సాగర్–శ్రీశైలం మార్గంలో లాంచ్ ప్రయాణం పర్యాటకులకు విశేష అనుభూతిని అందిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *