MS Dhoni retirement: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్ ఎంఎస్ ధోనీ(ms dhoni) రిటైర్మెంట్‌పై చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన వ్యాఖ్యలు సీఎస్కే అభిమానుల్లో ఆందోళనకు కారణమయ్యాయి.
ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరి సీజన్ అవుతుందని ఉతప్ప స్పష్టం చేశారు. 44 ఏళ్ల ధోనీ ఈ సీజన్ అనంతరం ఆటకు వీడ్కోలు పలికి, సీఎస్కేలో మెంటర్ పాత్రలో కొనసాగేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.
ALSO READ:IPL Auction 2026 | ఐపీఎల్ చరిత్ర లో అత్యంత ఖరీదైన ప్లేయర్…జాక్ పోటీ కొట్టింది ఎవరంటే?
ఇటీవలి కాలంలో CSK జట్టు యువ ఆటగాళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టడం గమనార్హం. గత సీజన్‌లో డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ వంటి యువ ఆటగాళ్ల ప్రదర్శన ఈ వ్యూహానికి ఉదాహరణగా నిలిచింది.
అబుదాబీలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ప్రషాంత్ వీర్, కార్తీక్ శర్మలను భారీ ధరకు కొనుగోలు చేయడం కూడా జట్టు భవిష్యత్ ప్రణాళికలను సూచిస్తోంది.
ఇప్పటికీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ, వికెట్‌కీపర్‌గా సేవలందిస్తున్న ధోనీ గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం కూడా తెలిసిందే.
అయితే జట్టులో యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం చూస్తే, ధోనీ ఆటగాడిగా కాకుండా మెంటర్‌గా మారే దిశగా అడుగులు వేస్తున్నారని ఉతప్ప అభిప్రాయపడ్డారు. ఆటకు వీడ్కోలు పలికినా సీఎస్కేతో ధోనీ అనుబంధం కొనసాగుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
