AP hostel food poisoning issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి(MP Dr. Gurumurthy) లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. నాయుడుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కేసులు తాను తీవ్రంగా గమనించినట్లు పేర్కొన్నారు.
పరిశుభ్రత లోపం, ఆహారం–నీటి నాణ్యతపై నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రాష్ట్రాలతో సమన్వయం గురించి ప్రశ్నించారు.
ALSO READ:దక్కించుకున్న సర్పంచ్ పదవి రూ.73 లక్షలకు ఏకగ్రీవం
సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కొన్ని పాఠశాలల్లో నీరు, ఆహారం కలుషితం కావడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు, వారికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఘటనల తరువాత హాస్టళ్లలో తనిఖీలు చేసి లోపాలు సరిచేసినట్లు రాష్ట్రం నివేదించినట్లు వివరించారు.
ఇదిపై గురుమూర్తి స్పందిస్తూ రాష్ట్రం పంపిన నివేదికలు నేలమీద ఉన్న వాస్తవాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, పలు వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం రాష్ట్ర వైఫల్యమని విమర్శించారు.
పీఎం పోషణ శక్తి నిర్మాణ పథకం అమలు, భోజన నాణ్యత కోసం కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు అగ్‌మార్క్ సరుకులు కొనుగోలు నుంచి ఆహార నమూనాల పరీక్షల వరకు వివరించి, ఇవన్నీ అమలు చేయడం రాష్ట్ర బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు.
