Modi Foreign Tour: అరబ్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్‌కు చేరుకున్నారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి అక్కడి ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు.
జోర్డాన్ రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఈ పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా రాజు అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్‌తో పాటు ప్రధాని జాఫర్ హసన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
ALSO READ:Amruta Fadnavis Contraversy | మెస్సీతో సెల్ఫీ వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య
ఈ సమావేశాల్లో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
జోర్డాన్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ పర్యటన భారత్–జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ, అమ్మాన్ విమానాశ్రయంలో లభించిన ఆత్మీయ స్వాగతానికి జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జోర్డాన్ ప్రధాని మోడీ నాలుగు రోజుల, మూడు దేశాల విదేశీ పర్యటనలో తొలి దశగా ఉంది. అనంతరం ఆయన ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు.
