సోనియానగర్ మరియు సారిపల్లిలో టిడ్కొ గృహ సముదాయాలను ఈరోజు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సందర్శించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ తో పాటు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఇమంది సుధీర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్శనలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు నివేదించిన సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అన్ని అంశాలను అధికారులతో చర్చించారు.
సోనియానగర్, సారిపల్లి ప్రాంతాలలో లబ్ధిదారులు టిడ్కొ గృహాలలో నివసించేలా పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. కాలనీలలో నీరు, విద్యుత్, రోడ్లు తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుషపాటి అదితి విజయలక్ష్మి గారు ప్రజలతో కలసి సమస్యలపై ప్రత్యక్షంగా చర్చలు జరిపారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.