పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్ లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను కొనియాడారు.మన భద్రత,రక్షణ కోసం రోజంతా శ్రమించే పోలీసులకు,సిబ్బందికి ప్రజలంతా సహకరించడమే కాకుండా వారికి తగు గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు,సీఐ విద్యాసాగర్,ఎస్ ఐ సురేంద్ర,బూసి జయలక్ష్మి భాస్కరరావు,కంఠంశెట్టి శ్రీనివాస్,ధరణాల రామకృష్ణ,కంఠంశెట్టి చంటి,మిద్దే ఆదినారాయణ,రెడ్డి తాతాజి, చొడపనీడి భాస్కరరావు,బీరా ఇసాక్,దొనబోయిన ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.