విజయదశమి పర్వదినాన ఆ నిరుపేదల కుటుంబాల్లో మంత్రి నారాయణ దంపతులు ఆనందం నింపారు.. బతుకు దెరువు కోసం కొందరికి.. నడవలేని స్థితిలో ఉన్న మరికొందరికి సాయమందించి.. వారికి అండగా ఉంటామనే భరో్సా ఇచ్చారు.. మీ కష్టసుఖాల్లో మేం తోడుగా ఉంటామనే నమ్మకాన్ని వారికి కల్పించారు.. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పలువురు చిరు వ్యాపారులను, వికలాంగులను మంత్రి నారాయణ దంపతులు అక్కున చేర్చుకున్నారు.. శనివారం ఉదయం మంత్రి క్యాంపు కార్యాలయంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లును, వికలాంగులకు ట్రైసైకిల్స్ అందజేశారు.. వారితో మంత్రి నారాయణతోపాటు,, ఆయన సతీమణి రమాదేవీ ముచ్చటించారు.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. కూటమి ప్రభుత్వ పనితీరును, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫీడ్ బ్యాక్ ను తెలుసుకున్నారు.. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు..
ఎన్నికల ప్రచార సమయంలో ఎంతో మంది చిరువ్యాపారులను , వికలాంగులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నట్లు వెల్లడించారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తోపుడుబండ్లతో పాటు.. ట్రైసైకిళ్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని.. గతంలో పలుమార్లు ఇచ్చామని.. మిగిలిన వారికి విజయదశమి సందర్బంగా పంపిణీ చేశామని వెల్లడించారు.. కూటమి ప్రభుత్వంలో.. సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నేతలు ఉన్నారు..