తెలంగాణ రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖా మంత్రి కొండా సురేఖను కించ పరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై జిల్లా మహిళా కాంగ్రెస్ విభాగం భగ్గుమంది. దీనికి మూల కారణమైన మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ డిమాండ్ చేసారు. గురువారం కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు.కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేసారు. పెళ్లయింది కళ్యాణ లక్ష్మి ఎప్పుడంటూ ఒక ఆడపడుచు మనోభావాలు దెబ్బతినేలా వ్వవహరించిన కేటీఆర్ వెంటనే మంత్రికి క్షమాపణ చెప్పాలని లేదంటే మరింత ఉద్రిక్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సోనియా,షబానా , జుబేదా , ఖమర్ బేగం, అఫ్రోజా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ , పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్, జైనథ్ మార్కెట్ కమిటి ఛైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, జఫర్ అహ్మద్, లోక ప్రవీణ్ రెడ్డి ,పోరెడ్డి కిషన్, దొగ్గలి రాజేశ్వర్ ,ఖయ్యూం, సోమ ప్రశాంత్,రమేష్,మంచాల మల్లయ్య,సమీర్ అహ్మద్,సంతోష్,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ క్షమాపణ కోరేలా మహిళా కాంగ్రెస్ నిరసన
