Lokesh Praises Teacher: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ పాఠశాలల్లో తమదైన శైలిలో విద్యార్థులకు బోధనలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులను ఎక్స్ వేదికగా అభినందిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా, అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న బుకెరామిరెడ్డిపల్లి కౌసల్య బోధనా విధానం మంత్రి లోకేశ్‌ను ఆకట్టుకుంది.
ఆమె విద్యార్థులతో కలిసి ఆటపాటలు, సామెతలు, సూక్తులను ఉపయోగించి పాఠాలు చెప్పే విధానం అత్యంత ప్రభావవంతంగా ఉందని లోకేశ్ సోషల్ మీడియాలో ప్రశంసించారు.
also read:Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు ఖర్చు లిమిట్లు
ముఖ్యంగా “English made easy”, “Let’s learn with techniques” వంటి పద్ధతులతో ఇంగ్లీష్, గణితం వంటి సబ్జెక్టులను కూడా సులభంగా అర్థమయ్యేలా బోధిస్తుండటం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
కౌసల్య టీచర్ రూపొందిస్తున్న ఎడ్యుటైన్‌మెంట్ కంటెంట్ సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతుండటంతో, అలాంటి గురువులు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులని మంత్రి లోకేశ్ అన్నారు.
