నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయం లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మావతి నగర్ యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం ఆలయంలో కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు. కాలనీవాసులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్లో కుంకుమ పూజ మరియు మహా అన్నదానం

A1flash news