మంత్రి కొండా సురేఖ మరియు నటుడు అక్కినేని నాగార్జున మధ్య కొనసాగుతున్న వివాదం నాగార్జునపై క్షమాపణ ట్వీట్‌తో కొత్త మలుపు తిరిగింది. కేటీఆర్‌పై విమర్శల సందర్భంగా నాగచైతన్య–సమంత విడాకులను ప్రస్తావించిన ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.
ఈ వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అదే సమయంలో, అర్థరాత్రి 12 గంటల తర్వాత సురేఖ సంచలన ట్వీట్ చేశారు.
ట్వీట్‌లో నాగార్జున కుటుంబంపై తనకు ఎలాంటి అవమానించే ఉద్దేశం లేదని, వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ALSO READ:భారత్‌లో ఇకపై నాలుగు ప్రధాన బ్యాంకులే.. ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం
ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేసినా, నాగార్జున కుటుంబం ఈ క్షమాపణను ఎలా స్వీకరిస్తుందో, అలాగే పరువు నష్టం దావాపై ఏమి జరుగుతుందో చూడాలి.
ఈ ట్వీట్‌తో వివాదం ముగిసిందా, లేక మరో మలుపు తిరుగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
