మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్(Maharashtra Muncipla Corporation Elections) ఎన్నికల్లో BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం అందరికి తేసలిసిందే. ముఖ్యంగా బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ఫలితాలపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గతంలో ముంబయి(Mumbai)లో తన కార్యాలయాన్ని కూల్చివేసిన ఘటనను గుర్తు చేసుకున్న కంగనా, అప్పటి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం చాలా గొప్ప విషయం.
ALSO READ:Telangana Municipal Elections | TGలో మున్సిపల్ ఎన్నికల కసరత్తు.. తుది ఓటర్ల జాబితా విడుదల
నన్ను వేధించిన వారు, నా బంగ్లాను కూల్చిన వారు, మహారాష్ట్ర విడిచిపోవాలని నన్ను బెదిరించిన వారిని ప్రజలే ఇప్పుడు తిరస్కరించారు. మహిళలపై ద్వేషభావంతో వ్యవహరించే బంధుప్రీతి మాఫియాకు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు.
2020లో ముంబయి బాంద్రాలో ఉన్న కంగనా రనౌత్ కార్యాలయంలోని కొంత భాగాన్ని అప్పటి బీఎంసీ అధికారులు అక్రమ నిర్మాణమని పేర్కొంటూ కూల్చివేశారు. ఈ చర్యపై ఆమె ముంబయి కోర్టును ఆశ్రయించగా, అధికారుల తీరుపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇది కక్ష సాధింపు చర్యలాగా కనిపిస్తోందని వ్యాఖ్యానించిన కోర్టు, కూల్చివేతను నిలిపివేయాలని ఆదేశిస్తూ, నటికి జరిగిన నష్టాన్ని బీఎంసీనే భర్తీ చేయాలని తీర్పు వెలువరించింది.
