Jio New Year Plans 2026: రిలయన్స్ జియో తన వినియోగదారులకు నూతన సంవత్సరం సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ “Happy New Year 2026” పేరుతో మూడు కొత్త రీచార్జ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ ప్లాన్‌లు నెలవారీ నుంచి వార్షిక వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.
ధరలు రూ.103 నుంచి రూ.3,599 వరకు ఉన్నాయి. వినోదం, ఉత్పత్తి సామర్థ్యం రెండింటికీ ఈ ప్లాన్‌లు అనుకూలంగా ఉండడం విశేషం.
జియో హీరో వార్షిక ప్లాన్(jio new year plans) ధర రూ.3,599. ఇందులో రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు, అపరిమిత 5G డేటా అందిస్తుంది. అదనంగా రూ.35,100 విలువైన “18 నెలల Google Gemini Pro AI సబ్‌స్క్రిప్షన్” ఉచితంగా ఇస్తోంది.
మంత్లీ యూజర్ల కోసం జియో సూపర్ సెలబ్రేషన్ ప్లాన్‌ను రూ.500కి తీసుకొచ్చింది. ఇది రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు 13 OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఒక్క నెల రీచార్జ్ చేసినా 18 నెలల Gemini Pro సబ్‌స్క్రిప్షన్ లభించడం ఈ ప్లాన్ ప్రత్యేకత.
అతి తక్కువ ధరకు జియో ఫ్లెక్సీ ప్యాక్ రూ.103కు అందుబాటులో ఉంది. 28 రోజుల పాటు 5GB డేటాతో పాటు హిందీ, ఇంటర్నేషనల్, రీజినల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్లాన్‌లు MyJio యాప్, జియో రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.
