ఐటీ రంగంలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త Labour Code ప్రకారం, IT మరియు ITES ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీలోగా జీతం చెల్లించడం తప్పనిసరిగా అయింది. సమాన పనికి సమాన వేతనం అందించాల్సిందేనని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
మహిళా ఉద్యోగులకు నైట్ షిఫ్ట్(Night Shift Rules)లో పనిచేయడానికి అనుమతి ఇవ్వడంతో పాటు, భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ALSO READ:Telangana MLAs Disqualification:అనర్హత వేటు భయంతో రాజీనామా యోచనలో దానం, కడియం.?
అదే విధంగా, కార్యాలయ వేధింపులు, వివక్ష, వేతన వివాదాలు వంటి అంశాలను నిర్ణీత కాలంలో పరిష్కరించడం తప్పనిసరి చేశారు. ఉద్యోగులు సంస్థలో చేరే సమయంలో నియామక పత్రాలు (appointment letters) ఇవ్వడం కూడా తప్పనిసరి నిబంధనల్లో భాగమైంది.
కొత్త లేబర్ కోడ్‌లు(new labour codes), ఇప్పటివరకు ఉన్న అనేక కార్మిక చట్టాలను సరళీకృతం చేస్తూ, ఉద్యోగుల హక్కులను మరింత బలపరచనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
